వర్షపాతం గణనీయంగా తగ్గే అవకాశం.. ఎల్‌నీనోపై పొంగులేటి సమీక్ష

కలం, వరంగల్ : ఎల్‌నీనో ప్రభావం కారణంగా ఈ ఏడాది సాధారణం కంటే వర్షపాతం గణనీయంగా తగ్గే అవకాశం ఉంది అని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Ponguleti Srinivasa Reddy) అంచనా వేశారు. ఎల్ నీనో ప్రభావం కారణంగా తీసుకోవాల్సిన చర్యలపై మంత్రి.. అధికారులతో వరంగల్ లో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలోని అనేక రాష్ట్రాల్లో వర్షాభావ పరిస్థితి ఉన్నప్పటికీ, దక్షిణాది రాష్ట్రాలు, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఈ పరిస్థితి మరింత తీవ్రంగా ఉండే అవకాశం ఉందన్నారు.

మూడు రోజుల క్రితం సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో వర్షాభావ పరిస్థితులపై సమగ్రంగా చర్చించినట్లు తెలిపారు. వర్షాభావ పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు ప్రతి ఉమ్మడి జిల్లాకు ఒక ప్రత్యేక అధికారిగా రాష్ట్ర ప్రభుత్వం నియమించిందని వెల్లడించారు.

ఆయా జిల్లాల్లో వ్యవసాయం, తాగునీటి లభ్యత, భూగర్భ జలాలు, వర్షాభావ పరిస్థితులు తదితర అంశాలపై ప్రత్యేక అధికారులు నివేదికలు సిద్ధం చేసి ప్రత్యేక అధికారులు ప్రభుత్వానికి అందజేస్తారని వివరించారు. ఉమ్మడి వరంగల్ జిల్లాకు దేవసేనను ప్రత్యేక అధికారిగా నియమించామన్నరు.

వర్షాభావ పరిస్థితుల నుంచి జిల్లాలను ఎలా గట్టెక్కించాలి, రైతులకు ఎలాంటి భరోసా కల్పించాలి, తాగునీటి సమస్యలు తలెత్తకుండా ఎలాంటి చర్యలు చేపట్టాలనే దానిపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ చేపట్టిందని పొంగులేటి చెప్పారు.

వర్షాభావ పరిస్థితులపై కేంద్ర ప్రభుత్వానికి సమగ్ర నివేదికను పంపించి, రాష్ట్రానికి అందాల్సిన సహాయం, కేంద్రం నుంచి పొందాల్సిన మద్దతుపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. ప్రజలు, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. పరిస్థితిని ప్రభుత్వం నిరంతరం పర్యవేక్షిస్తూ అవసరమైన అన్ని చర్యలు చేపడుతుందని మంత్రి (Ponguleti) స్పష్టం చేశారు.

Read Also: తిట్ల మీద ఉన్న ధ్యాస.. నీటి బొట్లపై లేదు: హరీశ్ రావు

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>