కలం, వెబ్ డెస్క్ : చిత్తూరు జిల్లా ఐరాల మండలం చిన్న వెంకటపల్లిలోని శివాలయంలో (Chittoor Shiva Temple) చోటుచేసుకున్న ఓ విచిత్ర ఘటన భక్తులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఆలయంలోని శివలింగంపై నూనెతో అభిషేకం నిర్వహించగా, ఆ నూనె క్రమంగా పాల రంగులోకి మారుతున్నట్లు భక్తులు గుర్తించారు.
ఈ విషయం క్రమంగా పక్క గ్రామాలకు పొక్కడంతో పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. శివలింగంపై పోసిన నూనె తెల్లటి పాల రంగులోకి మారడాన్ని కొందరు భక్తులు దైవ మహిమగా భావిస్తున్నారు.
ఈ అద్భుతాన్ని ప్రత్యక్షంగా చూసేందుకు చుట్టుపక్కల గ్రామాల ఆలయానికి క్యూ కట్టారు. అయితే, ఈ ఘటనపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నూనెలోని కొన్ని రసాయనిక లక్షణాలు లేదా శివలింగం ఉపరితలంతో జరిగే రసాయన చర్య వల్లే రంగు మారి ఉండొచ్చని మరికొందరు చెబుతున్నారు.
శివాలయంలో విచిత్రం.. భక్తులను ఆశ్చర్యపరుస్తున్న దృశ్యం!
-శివలింగానికి నూనెతో అభిషేకం చేస్తే పాలుగా మారుతున్న వైనం
-చిత్తూరు జిల్లా ఐరాల మండలం చిన్న వెంకటపల్లిలోని శివాలయంలో ఘటన
-దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్
Unbelievable Mystery at Chittoor Shiva Temple: Oil… pic.twitter.com/d30Oylps8r— Kalam Daily (@kalamtelugu) July 21, 2026
Read Also: ఢిల్లీలో హై టెన్షన్.. ప్రధాని మోదీ పై రేణుకా చౌదరి ఫైర్..!
Follow Us On: X(Twitter)

