Mobile Popup Ad
Mobile Popup Ad

తెలంగాణలో పరిస్థితులపై రాహుల్ గాంధీ ఆరా

కలం, వెబ్ డెస్క్: తెలంగాణలో తాజా రాజకీయ పరిస్థితులపై కాంగ్రెస్ అగ్ర నేత, లోక్ సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ (Rahul Gandhi) ఆరా తీశారు. ఢిల్లీలోని ఆయన నివాసంలో పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) కలిసి అనేక అంశాలపై చర్చించారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరించడంతో పాటు పార్టీ పరంగా జరుగుతున్న ఆర్గనైజేషన్ కార్యక్రమాల వివరాలను సైతం రాహుల్ గాంధీకి తెలియజేసినట్లు మహేష్ కుమార్ గౌడ్ మీడియాకు తెలిపారు.

నియామకాలపైనే ప్రధాన చర్చ..

పార్టీ పరంగా చేపట్టబోయే నియామకాలపైనే రాహుల్ గాంధీతో (Rahul Gandhi) ప్రధానంగా చర్చించినట్లు పీసీసీ చీఫ్ వివరించారు. డీసీసీ అధ్యక్షుల నియామకాలు, జిల్లా, మండల కమిటీలు, బూత్ లెవల్ స్థాయి నాయకుల నియామకాలు, అనుబంధ సంఘాల ఏర్పాటు తదితర అంశాలపై చర్చించామన్నారు. రాహుల్ గాంధీ హామీ ప్రకారం రాష్ట్రంలో కులగణన జరిపి.. పూర్తి వివరాలు వెల్లడించామన్నారు. ఈ నేపథ్యంలోనే.. దేశంలో చేపడుతున్న మహిళా రిజర్వేషన్ల బిల్లులో సైత బీసీ రిజర్వేషన్ల అంశాన్ని కూడా జోడించాలని విజ్ఞప్తి చేసినట్లు వివరించారు. అలాగే, రాబోయే ఏఐసీసీ జాతీయ ఓబీసీ సలహా మండలి సమావేశాన్ని హైదరాబాద్ లో నిర్వహించాలని కోరగా.. రాహుల్ గాంధీ సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు.

Read Also: ఇందిరమ్మ రాజ్యం అంటే ఎమర్జెన్సీ అని నిరూపించారు : కవిత

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>