Mobile Popup Ad
Mobile Popup Ad

ఇందిరమ్మ రాజ్యం అంటే ఎమర్జెన్సీ అని నిరూపించారు : కవిత

కలం, వెబ్ డెస్క్ : ఇందిరమ్మ రాజ్యం అంటే ఎమర్జెన్సీ అని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిరూపించారని జాగృతి అధ్యక్షురాలు కవిత (Kavitha) అన్నారు. ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో ఆమె ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు (RTC Strike) టెంట్ హౌజ్ సామాగ్రి, ఫంక్షన్ హాళ్లు అద్దెకు ఇస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించడంపై కవిత ఎక్స్ వేదికగా స్పందించారు. ఇలాంటి చర్యలను చూస్తే ‘మనం ఉన్నది ప్రజాస్వామ్య దేశంలోనేనా అన్న సందేహం కలుగుతోంది’ అని ఆమె (Kavitha) ఆగ్రహం వ్యక్తం చేశారు.

రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే ప్రజాస్వామ్యాన్ని ఏడో గ్యారంటీగా అమలు చేస్తామని చెప్పి అప్రకటిత ఎమర్జెన్సీ తీసుకువచ్చారని కవిత దుయ్యబట్టారు. ఆర్టీసీ సంస్థను ప్రైవేటుపరం చేసేందుకు కుట్రలు చేస్తున్నారని ఆమె ఆరోపించారు. ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్యాయత్నం చేయడంపై ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ కుట్రలతో కలత చెంది నర్సంపేట డిపో డ్రైవర్ నిప్పంటించుకుని ఆత్మహత్యాయత్నం చేయడం కలచి వేసిందన్నారు. డ్రైవర్ శంకర్ గౌడ్ కు ప్రభుత్వం మెరుగైన చికిత్స అందించాలని కోరారు. వెంటనే ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులతో చర్చలు ఏర్పాటు చేసి వారి న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని కవిత (Kavitha) పేర్కొన్నారు.

Read Also: సింగరేణి ఉద్యోగులకు ఎస్బీఐతో కొత్త బీమా ఒప్పందం

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>