బుద్ధుందా.. జనసేన నేతలపై నాగబాబు సీరియస్!

కలం, వెబ్ డెస్క్: జనసేన పార్టీ ముఖ్య నాయకుల తీరుపై ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబు (Nagababu) తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. పార్టీ అంతర్గత విషయాలు, ఇతర రాజకీయ అంశాలపై చర్చిస్తున్న నేతలను ఉద్దేశించి ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. ‘మీరంతా ఇన్ని విషయాలు మాట్లాడుతున్నారు కదా… పవన్ కళ్యాణ్ ఆరోగ్యం ఎలా ఉందో అని ఒక్కరైనా అడిగారా? కనీసం ఆ బుద్ధుందా? అంటూ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇదే సమయంలో అక్కడున్నవారు వివాదాస్పద అంశాలను ప్రస్తావించేందుకు ప్రయత్నించగా, నాగబాబు వెంటనే వారిని అడ్డుకున్నారు. ‘ఉండయ్యా… ఉండయ్యా నేను ఇక్కడ వివాదాల గురించి మాట్లాడేందుకు రాలేదు, ఈ విషయాన్ని ఇంతకంటే ముందుకు తీసుకెళ్లొద్దు’ అంటూ హెచ్చరించారు. పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) క్షేమమే తమకు మొదటి ప్రాధాన్యతని, అనవసర వివాదాలకు తావులేకుండా పార్టీ శ్రేణులు సంయమనం పాటించాలని నాగబాబు (Nagababu) స్పష్టం చేశారు.

Read Also: ఏపీ తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ లిసా గిల్

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>