మోదీపై రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు

కలం, వెబ్ డెస్క్: ప్రధాని మోదీపై లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi)  సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘మోదీని విదేశీ శక్తులు నియంత్రిస్తున్నాయి. ఆయన పూర్తిగా వారి చేతుల్లోకి వెళ్లిపోయారు. ఇది కేవలం ఆరోపణలు మాత్రమే కాదు, నా ఫోన్‌లో అన్ని ఆధారాలున్నాయి. నా ఫోన్‌ను ప్రధాని మోదీ ట్యాప్ చేస్తున్నారు. దమ్ముంటే నాతో ప్రజల ముందు డిబేట్‌కు వస్తే వాటిని ఆయన ముందే పెడుతాను. ఎవరు దేశానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారో ప్రజలకు తెలిసిపోతుంది. పార్లమెంటులో నాకు మాట్లాడేందుకు అవకాశం ఇవ్వడం లేదు. మైక్ ఆఫ్ చేస్తున్నారు. అందుకే బహిరంగంగానే ప్రజల ముందే చర్చించుకుందాం. మోదీ, నేను ఎదురుగా కూర్చుంటాం. జడ్జిలుగా గౌతమ్ అదానీ లేదా ఆర్ఎస్సెస్ అధినేత మోహన్ భాగవత్ వ్యవరించినా నాకు అభ్యంతరం లేదు’ అని స్పష్టం చేశారు.

మోదీ ప్రధాని పదవిలో ఉండరు..

తనతో బహిరంగ చర్చ పూర్తయ్యాక మోదీ ఇక ప్రధాని పదవిలో ఉండరని రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. కేవలం అయిదు నిమిషాల్లోనే ప్రధాని మోదీ దేశాన్ని ఎంతలా మోసం చేస్తున్నారో.. నేను ప్రూవ్ చేస్తాను అని కుండబద్దలు కొట్టారు. ఇదిలా ఉంటే, రాహుల్ గాంధీ వ్యాఖ్యలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. గురువారం మోదీ రాహుల్ గాంధీని ఉద్దేశించి.. రాజ్యాంగం జేబులో పెట్టుకుని తిరుగుతూ, అధికారం తమకే కావాలని కొందరు ఆశపడుతున్నారని మండిపడ్డారు. ఈ నేపథ్యంలో ప్రధానికి కౌంటర్‌గా రాహుల్ కీలక వ్యాఖ్యలు చేయడంపై బీజేపీ స్పందన కూడా ఆసక్తికరంగా మారింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>