ఆటో డ్రైవ‌ర్ల‌కు “ఆటో న‌గ‌ర్ కాల‌నీ”లు!

క‌లం, వెబ్‌డెస్క్‌: తెలంగాణ ప్రభుత్వం ఆటో రిక్షా వర్కర్ల (Auto Rickshaw Workers) సంక్షేమం కోసం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు క్యూర్ పరిధిలోని నాలుగు ప్రాంతాల్లో రూ.220 కోట్ల అంచనా వ్యయంతో 2,000 ఈడబ్ల్యూఎస్ ఫ్లాట్లను నిర్మించేందుకు అనుమతిస్తూ జీఓ జారీ చేసింది. ఈ ఫ్లాట్లకు ఇందిరమ్మ ఇండ్లు-టవర్స్ తరహాలోనే అన్ని నిబంధనలు, మార్గదర్శకాలను వర్తింపజేశారు. ఇందులో ఆటో నగర్ కాలనీ పేరుతో ఈ ప్రత్యేక గృహ నిర్మాణ పథకాన్ని అమలు చేయనున్నారు.

బండ్లగూడ (ఎల్ఐజీ కాలనీ), గండిమగుడ, పేట్‌బషీరాబాద్, జల్పల్లి, లక్ష్మిగూడ ప్రాంతాల్లో ఒక్కోచోట 500 చొప్పున మొత్తం 2,000 ఫ్లాట్లను నిర్మించనున్నారు. సొంతింటి కల నెరవేర్చుకోవడంతో పాటు ప్రతి పేద కుటుంబానికి ఇందిరమ్మ ఇండ్లు అందించాలనే ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా ఈ ప్రాజెక్టును చేపడుతున్నారు. భూ సేకరణ, సాంకేతిక అంశాలను పరిశీలించిన అనంతరం హౌసింగ్ బోర్డు తదుపరి చర్యలు చేపట్టనుంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>