రూ.3.50 కోట్లతో నిర్మించిన రహదారి ప్రారంభం.. గంగులకు ఘన స్వాగతం

కలం, కరీంనగర్ : బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ (MLA Gangula Kamalakar) ప్రత్యేక చొరవతో చర్లబూత్కూర్ నుంచి ప్రశాంత్‌నగర్ మీదుగా దుబ్బపల్లి వరకు రూ.3.50 కోట్ల నిధులతో నిర్మించిన రహదారి ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. గంగుల మంత్రిగా ఉన్న సమయంలో ఈ రహదారి నిర్మాణానికి నిధులు కేటాయించగా పనులు పూర్తయ్యాయి.

ఈ క్రమంలో శుక్రవారం ధాన్యం కొనుగోలు కేంద్రాల ప్రారంభోత్సవాలకు వెళ్లిన గంగుల కమలాకర్‌కు స్థానిక గ్రామాల ప్రజలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా నూతనంగా నిర్మించిన రహదారిపై గ్రామస్తులతో కలిసి ఎమ్మెల్యే స్వయంగా బైక్ నడుపుతూ ప్రయాణించారు. రహదారి నిర్మాణం పూర్తవడంతో తమ రాకపోకల కష్టాలు తీరాయని స్థానికులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కాలనీవాసులు గంగుల కమలాకర్‌ను ఘనంగా సత్కరించారు. రహదారి నిర్మాణానికి నిధులు కేటాయించి పనులు పూర్తి చేయించినందుకు ఆనందం వ్యక్తం చేస్తూ జై తెలంగాణ.. జై జై తెలంగాణ అంటూ నినాదాలు చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>