రఘునాథపల్లిలో భారీ వర్షం

కలం, రఘునాథపల్లి : జనగామ జిల్లా రఘునాథపల్లి (Raghunathpalli) మండలంలోని ఖిలాషాపూర్, మేకలగట్టు తదితర గ్రామాల్లో సోమవారం సాయంత్రం ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. వర్షంతో పాటు వీచిన ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. బలమైన గాలుల ప్రభావంతో మామిడి తోటల్లో కాయలు భారీగా నేలరాలాయి. చేతికొచ్చిన పంట కళ్లముందే నేలపాలవుతుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈదురుగాలులు, వర్షాల కారణంగా మామిడి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లే అవకాశం ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే పంట సాగులో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతులకు తాజా వాతావరణ పరిస్థితులు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి.

Read Also: అత్యవసర ప్రయాణం.. టికెట్ లేకున్నా ట్రైన్‌లో వెళ్లొచ్చా? రైల్వే రూల్స్ ఇవే

Read Also: మన గుడులు.. మన సంస్కృతి 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>