Mobile Popup Ad
Mobile Popup Ad

తెలంగాణ అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉంది: రఘునందన్ రావు

కలం, వెబ్ డెస్క్: తెలంగాణ అభివృద్ధికి బీజేపీ ఎల్లప్పుడూ కట్టుబడే ఉందని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు (Raghunandan Rao) అన్నారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ అవినీతి, కుటుంబ పాలనపై అలుపెరుగని పోరాటం చేస్తున్న ఏకైక పార్టీ బీజేపీ అని స్పష్టం చేశారు. పదేళ్లు రాష్ట్రాన్ని దోచుకుని.. ప్రజల చేతిలో ఓడిపోయి ఇంట్లో కూర్చున్న బీఆర్ఎస్ నేతలకు ఇప్పుడు మళ్ళీ ‘తెలంగాణ సెంటిమెంట్’ గుర్తొచ్చిందా? అంటూ సెటైర్లు వేశారు. తామే తెలంగాణ భూమి పుత్రులం అని గొప్పలు చెప్పుకునే బీఆర్ఎస్ వాళ్లు.. 2001లో జలదృశ్యంలో బీజేపీ పోరాడుతుంటే, 2007లో అమెరికాకు ఎందుకు వెళ్లారు? అని ప్రశ్నించారు. నిజానికి ఏ ఒక్క పార్టీ వల్ల తెలంగాణ రాలేదని.. పార్లమెంట్ లో కాంగ్రెస్ బిల్లు పెడితే, బీజేపీ బేషరతుగా మద్దతిస్తేనే సాధ్యమైందని చెప్పారు. “మా నాయననే ఓజీ, పీజీ.. మాదే కేజీఎఫ్” అన్నట్లుగా బీఆర్ఎస్ నేతలు తెలంగాణను ఒక బంగారు గనిలా దోచుకున్నారు కాబట్టే.. ప్రజలు మీకు తగిన బుద్ధి చెప్పి ఇంట్లో కూర్చోబెట్టారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ఉన్నా, టీఆర్ఎస్ ఉన్నా.. రాజకీయాలకు అతీతంగా ప్రధాని మోదీ ఒక ‘టీమ్ ఇండియా కెప్టెన్’ లాగా అన్ని రాష్ట్రాలను సమాన దృష్టితో చూస్తూ దేశ అభివృద్ధికి కృషి చేస్తున్నారని చెప్పారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>