కలం, వెబ్ డెస్క్: రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్ధా (Raghav Chadha) ఆప్ నుంచి బీజేపీలో చేరిన నేపథ్యంలో సోషల్ మీడియాలో ఆయనపై తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది. ఇన్ స్టాలో చద్ధాకు నిన్నటివరకు 14.6 మిలియన్ల ఫాలోవర్లు ఉండగా.. బీజేపీలో చేరుతున్న ప్రకటించిన తరువాత ఆయన అభిమానులు అన్ ఫాలో కొట్టడం ప్రారంభించారు. అలా ఒక్క రోజులోనే ఏకంగా 10 లక్షల మంది వరకు అన్ ఫాలో కొట్టడంతో ఫాలోవర్ల సంఖ్య 13.4 మిలియన్లకు పడిపోయింది. ఒకే రోజులో ఈ స్థాయిలో ఒక రాజకీయ నాయకుడికి అన్ ఫాలో కొట్టడం కూడా ఇదే మొదటిసారని టెక్ నిపుణులు చెబుతున్నారు.
త్వరలోనే కేబినెట్ మంత్రి పదవి..?
ఆప్ నుంచి బీజేపీలో చేరడమే కాకుండా, తనతో పాటు మరో ఆరుగురిని సైతం కమలం పార్టీలో చేర్పించేలా వ్యూహాత్మకంగా వ్యవహరించిన రాఘవ్ చద్ధాకు (Raghav Chadha) మంత్రి పదవి యోగం దక్కనుందనే ఊహాగానాలు వస్తున్నాయి. త్వరలో జరిగే కేంద్ర మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణలో చద్ధాకు కేంద్ర కేబినెట్ మంత్రి పదవి ఇవ్వబోతున్నారని సమాచారం. ఈ మేరకు, ఆయనకు అమిత్ షా ఇప్పటికే హామీ ఇచ్చినట్లు దిల్లీ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది.
Read Also: ఆర్టీసీ సమ్మెకు పోయిందంటే అది కాంగ్రెస్ పాపమే: జగదీశ్ రెడ్డి
Follow Us On: Instagram

