Mobile Popup Ad
Mobile Popup Ad

ఆర్టీసీ సమ్మెకు పోయిందంటే అది కాంగ్రెస్ పాపమే: జగదీశ్ రెడ్డి

కలం, వెబ్ డెస్క్: తెలంగాణ ఆర్టీసీ కార్మికులు సమ్మెకు (RTC Strike) పోయారంటే ఆది కాంగ్రెస్ పాపమేనని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి (Jagadish Reddy) తీవ్ర విమర్శలు చేశారు. కార్మికుల ఆత్మహత్యలకు కాంగ్రెస్ పార్టీదే భాద్యత అని పేర్కొన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ లో లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను ఆయన పంపిణీ చేశారు. దివ్యాంగులకు త్రీ వీలర్ వెహికల్స్ పంపిణీ చేయడంతో పాటు అంగన్వాడీలకు మొబైల్ ఫోన్ల పంపిణీ చేసి మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని జగదీశ్ రెడ్డి దుయ్యబట్టారు. ఇచ్చిన ఏ ఒక్క హామీ పూర్తిగా నేరవేర్చడం లేదన్నారు. లబ్ధిదారుల్లో తీవ్రమైన నిరాశ కనబడుతుందని చెప్పారు. కేసీఆర్ ఇచ్చిన లక్ష తప్ప తులం బంగారం ఇంకెప్పుడిస్తారని ఎదురుచూస్తున్నారని తెలిపారు. ఈ విషయం గురించి మహిళల్లో తీవ్రంగా చర్చ జరుగుతుందన్నారు. ఆడపిల్ల పెండ్లికి తులం బంగారం త్వరగా ఇవ్వాలని డిమాండ్ చేశారు.

సెంటర్లు ప్రారంభించి.. కొనుగోళ్లు ఆపుతున్నారు..

రాష్ట్రంలో వడ్లు, మక్కల కొనుగోలు విషయంలోనూ జాప్యం సరికాదని మాజీ మంత్రి (Jagadish Reddy) విమర్శించారు. కొనుగోళ్లు అన్నీ కేంద్రాల్లో సజావుగా కొనసాగించాలని.. మబ్బులు చూసి రైతుల గుండెల్లో గుబులు మొదలైతుందని చెప్పారు. అకాల వర్షాలు పడకముందే కొనుగోలు సజావుగా పూర్తిచేయాలని చెప్పారు. పేరుకే సెంటర్లు ప్రారంభిస్తున్నారని.. కొనుగోళ్లు మాత్రం అపుతున్నారని అన్నారు. దళారుల చేతిలో రైతులు తీవ్రంగా మోసపోతున్నారని మండిపడ్డారు. మళ్లీ పాత పద్ధతుల్లో దలారుల చేతుల్లో మోసపోయే దుస్థితి నెలకొందని చెప్పారు. కేసీఆర్ (KCR) పాలన కంటే ముందున్న రోజులే కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మళ్లీ దాపూరిస్తున్నాయని ఘాటు వ్యాఖ్యలు చేశారు. మంచినీళ్ల విషయాంలోనూ తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయని చెప్పారు. రాష్ట్రంలో విద్యుత్ కోతలు విపరీతంగా మొదలయ్యాయన్నారు. ఒకటి కాదు రెండు కాదు అన్ని రంగాల్లోనూ ఈ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఫైర్ అయ్యారు. ఇకనైనా ప్రభుత్వం మేలుకొని హామీల అమలుపై, అభివృద్ధిపై దృష్టి పెడితే మంచిదని హితవు పలికారు.

Read Also: అమిత్ షా సిఫార్సు.. వద్దన్న రాహుల్ గాంధీ!

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>