కలం డెస్క్: దక్షిణాఫ్రికా–భారత్ మధ్య కటక్‌లో జరిగిన రెండో టీ20లో టీమిండియా 51 పరుగుల తేడాతో ఘోర పరాజయం పొందింది. ఇందులో భారత్ ఓటమిపై దక్షిణాఫ్రికా ఆటగాడు క్వింటన్ డి కాక్(Quinton De Kock) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తాము గెలవడానికి, భారత్ ఓడిపోవడానికి గల కారణాలను వివరించాడు. 214 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో భారత్ 162 పరుగులకే ఆలౌట్ అయింది. ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా బ్యాటర్ క్వింటన్ డికాక్ 90 పరుగులతో చెలరేగాడు. అతడికి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది.
మ్యాచ్ అనంతరం డికాక్(Quinton De Kock) చేసిన వ్యాఖ్యలు ఇండియా నిర్ణయాలపై ప్రశ్నలు లేవనెత్తాయి. పిచ్ రెండు ఇన్నింగ్స్‌ల మధ్య పూర్తిగా మారిపోయిందని, భారత్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోవడం కీలక తప్పిదమని పరోక్షంగా సూచించాడు. “మేము బ్యాటింగ్ చేసినప్పుడు బంతి నెమ్మదిగా ఉన్నది. కదలిక తక్కువ. కానీ భారత్ చేజ్ మొదలుపెట్టే సమయానికి పిచ్ వేగం పెరిగింది. బంతి ఎక్కువగా కదలడం ప్రారంభించింది. ఈ రెండు పరిస్థితులు చాలా విభిన్నం,” అని డికాక్ వివరించాడు.
దక్షిణాఫ్రికా(South Africa) 213 పరుగులతో భారీ స్కోరు అందించగా, భారత బ్యాటర్లు పిచ్ వేగం పెరగడం, బంతి మూమెంట్ ఎక్కువగా ఉండడం వల్ల భారీగా కష్టపడ్డారు. ఈ మార్పులకు టీమిండియా సరైన సమాధానం ఇవ్వలేకపోయిందని డికాక్ మాటలతో స్పష్టం. ఈ ఓటమితో సిరీస్ సమీకరణలు మారగా, భారత్ మూడో టీ20లో తప్పక గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
Read Also: భారత్‌లో మూతపడ్డ విమాన సంస్థలు.. కారణాలేంటి?
Follow Us On: Youtube


