కలం, వెబ్ డెస్క్ : పాకిస్థాన్‌లోని బలూచిస్తాన్ (Balochistan) రాజధాని క్వెట్టా పేలుళ్లతో దద్దరిళ్లింది. ఉగ్రవాదులు చమన్ ఫాటక్ సమీపంలో కంటోన్మెంట్ వైపు వెళ్తున్న ప్రయాణికుల రైలును లక్ష్యంగా చేసుకుని వాహనాలతో ఆత్మాహుతి దాడికి తెగబడ్డారు. ఈ దారుణ ఘటనలో కనీసం 25 మంది ప్రాణాలు కోల్పోగా, 47 మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో మహిళలు, చిన్నారులు పెద్ద సంఖ్యలో ఉన్నట్లు సమాచారం.
ఈ భారీ పేలుడు ధాటికి రైలు పట్టాలు తప్పింది. బోగీల్లో పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో ప్రయాణికులు ప్రాణభయంతో పరుగులు తీశారు. క్షేత్రస్థాయి నుంచి అందుతున్న వివరాల ప్రకారం బలూన్ లిబరేషన్ ఆర్మీ (BLA) ఉగ్రవాదులే ఈ దారుణానికి ఒడిగట్టినట్లు అనుమానిస్తున్నారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి అత్యవసర చికిత్స అందిస్తున్నారు. క్షతగాత్రులలో పలువురి పరిస్థితి విషమంగా ఉండటంతో మరణాల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Read Also: ఆఫ్రికా దేశాలను వణికిస్తున్న ఎబోలా.. 200 మంది మృతి
Follow Us On: Sharechat

