ఆఫ్రికా దేశాలను వణికిస్తున్న ఎబోలా.. 200 మంది మృతి

కలం, వెబ్ డెస్క్: ఆఫ్రికా దేశాల్లో ఎబోలా వైరస్ (Ebola Virus) మరణమృదంగం కొనసాగుతోంది. కాంగో, అంగోలా, టాంజానియా దేశాల్లో ఇప్పటివరకు 200 మంది వరకు మరణించినట్లు WHO పేర్కొంది. 867 మందికి చికిత్స కొనసాగుతున్నట్లు తెలిపింది. ప్రపంచ వ్యాప్తంగా ఎబోలా ఎమర్జెన్సీ ఇప్పటికే ప్రకటించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ.. ఆఫ్రికా ఖండంలోని 10 దేశాలు ప్రమాదం అంచున ఉన్నట్లు ఆఫ్రికాలోని వ్యాధుల నివారణ కేంద్రం డైరెక్టర్ జీన్ కెసెయా ఆందోళన వ్యక్తం చేశారు. అంగోలా, బురుండి, సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్, కాంగో, ఇథియోపియా, కెన్యా, రువాండ, సూడాన్, టాంజానియా, జాంబియా దేశాల్లో ఎబోలా తీవ్రత అధికంగా ఉందని వివరించారు.

వైరస్ వ్యాప్తికి అదే కారణం..

జన సంచారం అధికంగా ఉండటంతో పాటు వైరస్ పట్ల భయాలు ఎబోలా వ్యాప్తికి ప్రధాన కారణాలుగా విశ్లేషిస్తున్నారు. ఉగాండా దేశంలో పరిస్థితి మరీ భయంకరంగా ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది. ఒక డ్రైవర్, హెల్త్ వర్కర్, మరో మహిళ తాజాగా వైరస్ బారిన పడినట్లు వివరించింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>