కేంద్రమంత్రి ఇలాకాలో అరాచకాలు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్

కలం, ఖమ్మం బ్యూరో : కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి ఇలాఖాలోనే అరాచకాలు జరుగుతున్నాయని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ (Puvvada Ajay Kumar) ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం కరీంనగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై, ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి పై బీజేపీ శ్రేణులు చేసిన దాడి అరచకాలకు నిదర్శనమన్నారు. ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజా ప్రతినిధుల క్యాంపు కార్యాలయాలపైనే ముప్పేట దాడులు జరుగుతుంటే, రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉన్నట్లా? లేనట్లా? అని ఆయన (Puvvada Ajay Kumar) ప్రశ్నించారు.

ఏకంగా కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలోనే ఇలాంటి పరిస్థితులు నెలకొనడం అత్యంత దురదృష్టకరమన్నారు. దాడులకు పాల్పడిన వారిపై వెంటనే కఠిన చర్యలు తీసుకుని, రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇలాంటి దాడులు ఆపకపోతే… ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు ప్రజలే వీధుల్లోకి రావాల్సిన పరిస్థితి వస్తుందని పువ్వాడ అజయ్ ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>