కలం, సినిమా : డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ (Puri Jagannadh), తమిళ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి (Vijay Sethupathi) కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్.. ‘స్లమ్‌డాగ్ 33 టెంపుల్ రోడ్’(Slumdog 33 Temple Road) మూవీ శరవేగంగా రూపుదిద్దుకుంటోంది. ఈ చిత్రానికి సంబంధించిన పనులు ప్రస్తుతం ఫుల్ స్వింగ్‌లో కొనసాగుతున్నాయని చిత్ర యూనిట్ వెల్లడించింది. ముఖ్యంగా మ్యూజిక్ సిట్టింగ్స్‌లో దర్శకుడు పూరి జగన్నాథ్ బిజీగా ఉన్నట్లు సమాచారం.
ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్న హర్షవర్ధన్ రామేశ్వర్‌తో కలిసి పూరి (Puri Jagannadh) ప్రత్యేకంగా మ్యూజికల్ సెషన్స్ నిర్వహిస్తున్నారు. ప్రేక్షకులకు థ్రిల్లింగ్‌తో పాటు అదిరిపోయే మ్యూజికల్ ఎక్స్‌పీరియన్స్ ఇవ్వాలని ఈ క్రేజీ కాంబినేషన్ ప్లాన్ చేస్తోందని సినీ వర్గాలు చెబుతున్నాయి. క్యూట్ బ్యూటీ ‘సంయుక్త’ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో ప్రముఖ నటి ‘టబు’ కీలక పాత్రలో కనిపించనున్నారు. అలాగే నటులు వీటీవీ గణేష్, దునియా విజయ్ కూడా ఈ ప్రాజెక్ట్‌లో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషలలో ఈ సినిమాను గ్రాండ్‌గా విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఈ మూవీ నుంచి త్వరలోనే మరిన్ని స్ట్రైకింగ్ అప్‌డేట్స్ రానున్నాయని చిత్ర యూనిట్ ప్రకటించడంతో అభిమానులలో ఆసక్తి మరింత పెరిగింది.
Read Also: జాతీయ ఈ-గవర్నెన్స్ అవార్డుల రేసులో యాదాద్రి టెంపుల్
Follow Us On : WhatsApp

