ములకలపల్లిలో రోడ్డు ప్రమాదం.. యువకుడు మృతి!

కలం, ఖమ్మం బ్యూరో: ​భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri Kothagudem) జిల్లా ములకలపల్లి మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు ద్విచక్ర వాహనాలు బలంగా ఢీకొన్న ఘటనలో ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. ​స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. ములకలపల్లి మండల పరిధిలోని పాలవాగు బ్రిడ్జి సమీపంలో గురువారం రాత్రి రెండు బైక్‌లు ఎదురెదురుగా అతివేగంతో ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో బైక్‌పై ఉన్న యువకుడు తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే మృతి చెందాడు. ​ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే స్థానికులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతుడిని పాల్వంచ నెహ్రూ నగర్‌కు చెందిన తుంపూరి కళ్యాణ్‌గా గుర్తించారు.

నిండు నూరేళ్ల భవిష్యత్తు ఉన్న యువకుడు ఇలా అర్థాంతరంగా మృతి చెందడంతో ఆయన కుటుంబ సభ్యులు, స్నేహితులు కన్నీరుమున్నీరవుతున్నారు. ​సమాచారం అందుకున్న ములకలపల్లి పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ​మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పాల్వంచ ఆసుపత్రికి తరలించారు. అలాగే ప్రమాదానికి గల కారణాలపై వివరాలు సేకరించారు. ​ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు.

Read Also: బీజింగ్‌లో ట్రంప్ సెన్సేషన్: చైనాతో భారీ ఒప్పందాలు!

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>