ఆదరణ లేని పాటగాళ్లు.. సాయం కోరుతున్న ‘పురందర దాసు’ కళాకారులు!

కలం, వెబ్ డెస్క్: భారతీయ కళలకు ఎంతో చరిత్ర ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన కళలు ప్రత్యేకమైనవి కూడా. వెస్ట్రన్ కల్చర్ ప్రభావమో.. మారుతున్న కాలామో.. ఆనాటి కళలు అంతరించిపోతున్నాయి. ఈ నేపథ్యంలో మంత్రాలయానికి (Mantralayam) చెందిన పురందరదాసు (Purandara Dasa) కీర్తనల గాయకులు రుద్రాక్షి బాలరాజు, ఉమేశ్ లాంటి కళాకారులు జీవనోపాధి కోసం అనేక ఇబ్బందులు పడుతున్నారు. హార్మోనియం వాయిస్తూ ‘నారాయణతే నమో నమో’ అంటూ వీధుల వెంట తిరుగుతున్నారు. శ్రావ్యంగా పాడే వీరి ప్రతిభ కేవలం సంక్రాంతి, దసరా పండుగలకే పరిమితం కావడం ఆందోళన కలిగిస్తోంది. ప్రస్తుత తరం ఈ కళ పట్ల ఆసక్తి చూపకపోవడం వల్ల ఈ జానపద సంపద మాతోనే అంతరించిపోతుందన్న ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ బిడ్డల పెళ్లిళ్ల కోసం, కనీస అవసరాల కోసం దాతల సాయం కోరుతున్నారు. (ఫోన్: 63639 62694) సాయం చేయాలని కోరుతున్నారు.

దశాబ్దాల చరిత్ర కలిగిన సురభి నాటక కళాకారుల పరిస్థితి కూడా అత్యంత దయనీయంగా మారింది. వెలుగు జిలుగుల రంగస్థలంపై అద్భుత ప్రదర్శనలు ఇచ్చే వీరు, తెర వెనుక ఆకలితో అలమటిస్తున్నారు. ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు స్పందించి ఈ కళాకారులకు శాశ్వత జీవనోపాధి కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తెలుగు సంస్కృతిలో భాగమైన ఈ అద్భుత కళలు రాబోయే కాలంలో కేవలం చరిత్ర పుస్తకాలకే పరిమితమయ్యే ప్రమాదం ఉంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>