కలం, వెబ్ డెస్క్ : బెంగళూరు (Bengaluru)లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. మదనాయకనహళ్లిలో రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న మాజీ భార్యపై ఓ వ్యక్తి హత్య ప్రయత్నం చేశారు. అందరూ చూస్తుండగానే దాడి చేయడంతో స్పందించిన స్థానికులు ఆ దుర్మార్గుడి నుంచి మహిళను రక్షించి అతడికి దేహశుద్ది చేశారు. ఘటనకు సంబంధించిన దృశ్యాలు అక్కడన్న సీసీ టీవీ కెమెరాలో రికార్డ్ అయింది.
సంజయ్ అనే వ్యక్తి స్కూటిమీద వచ్చి అకస్మాత్తుగా కత్తితో దాడికి ఒడిగట్టాడు. ఆమె ప్రతిఘటించినా పట్టుకుని హత్య చేయడానికి ప్రయత్నించాడు. అయితే, అక్కడే ఉన్న కొందరు యువకులు వెంటనే అప్రమత్తమై సంజయ్ ను అదుపులోకి తీసుకుని మహిళను కాపాడారు. ఘటనపై కేసు నమోదు చేసిన మదనాయకనహళ్లీ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కాగా, ఘటన తీవ్ర సంచలనంగా మారింది.
#Shocking incident in #Bengaluru.
A man identified as Sanjay allegedly tried to #attack his ex-wife with a knife in the middle of the road. Alert youngsters overpowered him & rescued the woman. Madanayakanahalli Police are probing.@timesofindia pic.twitter.com/5rR4eo6sqa
— TOI Bengaluru (@TOIBengaluru) May 7, 2026

