నీట్ లీకేజీపై విద్యార్థుల్లో ఆందోళన: పోలాడి రామారావు

కలం, కరీంనగర్ బ్యూరో: నీట్ పేపర్ లీక్ కావడంపై విద్యార్థుల్లో తీవ్ర ఆందోళన నెలకొందని ప్రజా సంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షులు పోలాడి రామారావు అన్నారు. శుక్రవారం కరీంనగర్ (Karimnagar) జిల్లా కేంద్రంలో విద్యార్థి, యువజన, ప్రజాసంఘాల సమావేశంలో పోలాడి రామారావు మాట్లాడారు. ఎన్నో ఏళ్లుగా కష్టపడి చదివిన విద్యార్థుల ఆశలు, వారి తల్లిదండ్రుల కలలు ప్రశ్నాపత్రాల లీకేజీలతో ప్రశ్నార్థకంగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు.

23 మంది విద్యార్థుల ఆత్మహత్య..

23 మంది విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని, లక్షలాది మంది విద్యార్థులు నష్టపోయారని పోలాడి రామారావు వివరించారు. ఇది పరీక్షలో జరిగిన తప్పిదం కాదని, దేశ విద్యా వ్యవస్థ విశ్వసనీయతపై పడిన మచ్చగా మిగిలిందన్నారు. నాణ్యమైన విద్య, మెరుగైన పరీక్ష విధానం కోసం ఢిల్లీలో గళమెత్తిన విద్యార్థులను లాఠీలతో కొట్టి, కేంద్ర సర్కార్ కర్కశంగా అణచివేస్తోందన్నారు.

పోలీసులపై చర్యలు తీసుకోవాలి..

విద్యార్థులపై విచక్షణా రహితంగా దాడి చేసిన పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలాడి రామారావు డిమాండ్ చేశారు. అలాగే, వారిపై పెట్టిన కేసులు ఎత్తివేసి క్షమాపణలు చెప్పాలని, ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు రూ. కోటి చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలన్నారు. కేంద్ర, రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీలో పాలకుల అలసత్వంతో నిరుద్యోగ యువత నిరాశలకు లోనవుతోందన్నారు.

ఈ కార్యక్రమంలో నాయకులు కన్నం లక్ష్మణ్, కూరతోట సురేందర్, కల్వకుంట్ల వంశీధర్ రావు, బండ సుధాకర్ రెడ్డి, జనగామ కరుణాకర్ రావు, పిన్నింటి లక్ష్మణ్ కుమార్, జంపాల బాబు, పోల్సాని సునీల్, కనపర్తి సాయి, మిరుదొడ్డి అనిల్, భరత్, మంద మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>