కలం, వెబ్ డెస్క్ : హిమాచల్ ప్రదేశ్(Himachal Pradesh)లోని చంబా జిల్లా గిరిజన ప్రాంతం పాంగిలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. కిలాడ్ -ఉదయ్‌పూర్ రహదారిపై వెళ్తున్న టాటా సుమో వాహనంపై ఒక్కసారిగా కొండ చరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో వాహనం పూర్తిగా ధ్వంసం అయింది. మొత్తం కారులో వెళ్తున్న 15 మంది ప్రయాణికుల్లో 13 మంది దుర్మరణం చెందారు. ఇద్దరు సురక్షితంగా ప్రాణాలతో బయటపడినట్లు నేషనల్ మీడియాల్లో కథనాలు వెలువడుతున్నాయి.
ఈ ఘటన సమాచారం విషయం తెలిసిన వెంటనే స్థానికులు , అధికారులు అప్రమత్తమై సహాయక చర్యలు ప్రారంభించారు. కొండచరియలు పడిన వెంటనే టాటా సుమో వెనుక భాగంగలో భారీగా మంటలు చెలరేగినట్లు స్థానికులు వెల్లడించారు. ఈ క్రమంలోనే మంటలను ఆర్పేందుకు స్థానికులు, భద్రతా సిబ్బంది ప్రయత్నించారు. ఈ ప్రమాదంకు సంబంధించిన ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

