పెండింగ్ దరఖాస్తులపై ప్రత్యేక దృష్టి సారించాలి: కలెక్టర్

కలం, ఆదిలాబాద్ : ఆదిలాబాద్ జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాజర్షి షా (Rajarshi Shah ) అర్జీలను స్వీకరించి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజావాణికి వచ్చే ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి, నిబంధనల మేరకు నిర్ణీత గడువులోగా సత్వరమే పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. మండలాల వారీగా పెండింగ్‌లో ఉన్న ప్రజావాణి దరఖాస్తులపై ప్రత్యేక దృష్టి సారించి, ఎప్పటికప్పుడు పరిష్కరించాలని సూచించారు.

సమస్యల పరిష్కారానికి సంబంధిత అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేయాలని స్పష్టం చేశారు. ప్రజావాణిలో విద్య, వైద్యం, ఇందిరమ్మ ఇళ్లు, పింఛన్లు, భూ సమస్యలు తదితర అంశాలకు సంబంధించిన దరఖాస్తులు అందాయి. ప్రతి అర్జీని పరిశీలించి, అర్హతలు, ప్రభుత్వ నిబంధనల మేరకు బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

దరఖాస్తుల పరిష్కారంలో జాప్యం, నిర్లక్ష్యాన్ని సహించేది లేదని, ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే ప్రభుత్వ అధికారుల ప్రధాన బాధ్యత అని కలెక్టర్ పేర్కొన్నారు. అనంతరం, సీఈఓగా పదోన్నతి పొందిన డీఆర్డీఓ పీడీ రవీందర్ రాథోడ్‌ను కలెక్టర్ రాజర్షి షా అధికారులతో కలిసి శాలువాతో సన్మానించి, శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు ఆర్ఎస్ చిత్రూ, రాజేశ్వర్, డీఆర్వో స్రవంతి, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>