కలం, కరీంనగర్ బ్యూరో: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదిన (KTR Birthday) వేడుకలను కరీంనగర్ జిల్లాలో గులాబీ శ్రేణులు సేవా కార్యక్రమాల మధ్య నిర్వహించారు. కేవలం ప్రజా సేవకు మాత్రమే ప్రాధాన్యం ఇవ్వాలని కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు నాయకులు జిల్లా వ్యాప్తంగా విభిన్న కార్యక్రమాలు చేపట్టారు.
రేగుర్తి బధిరుల ఆశ్రమ పాఠశాలలో
బీఆర్ఎస్ నగర శాఖ అధ్యక్షుడు చల్ల హరిశంకర్ ఆధ్వర్యంలో రేగుర్తిలోని బధిరుల ఆశ్రమ పాఠశాల విద్యార్థులకు నోటు పుస్తకాలు, పెన్నులు, స్టేషనరీ సామగ్రిని పంపిణీ చేశారు. కేటీఆర్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు.
అల్పాహార వితరణ
మార్కెట్ రోడ్డులోని వేంకటేశ్వర స్వామి ఆలయంలో మాజీ మేయర్ సర్ధార్ రవీందర్ సింగ్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కూరగాయల వ్యాపారులు, బాటసారులకు అల్పఆహార వితరణ చేపట్టారు. రానున్న రోజుల్లో కేటీఆర్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షించారు.
మదర్సా విద్యార్థులకు స్టేషనరీ అందజేత
32వ డివిజన్ హుస్సేనీపురాలోని మదర్సాలో చదువుతున్న విద్యార్థులకు కార్పొరేటర్ షేక్ యూసుఫ్ ఆధ్వర్యంలో సుమారు 150 మంది పిల్లలకు నోటు పుస్తకాలు, పెన్నులు అందజేశారు. రానున్న కాలంలో బీఆర్ఎస్ పార్టీ తిరిగి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
పలకల పంపిణీ
33వ డివిజన్ కార్పొరేటర్ జమ్ము ఆధ్వర్యంలో డివిజన్లోని అంగన్వాడీ కేంద్రంలో విద్యార్థులకు పలకలు, బలపాలు, బిస్కెట్ ప్యాకెట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాల్లో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు జి.వి. రామకృష్ణారావు, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ రావు, మాజీ మేయర్ సర్ధార్ రవీందర్ సింగ్, కార్పొరేటర్లు యూసుఫ్, జమ్ము, కాల్వ మల్లేశం, గుగ్గిళ్ల జయశ్రీ శ్రీనివాస్, మాజీ కార్పొరేటర్లు, ఐలెందేర్ యాదవ్, గందె మహేష్, రాజ శేఖర్, సదానంద చారి, అనూప్ కుమార్, మాజీ జడ్పీ కో అప్షన్ సభ్యులు జమీలుద్దీన్, మీర్ సౌకత్ అలీ, నాయకులు సుంకిశాల సంపత్ రావు, ప్రశాంత్ రెడ్డి, గంగాధర చందు, వాజీద్ హుసేన్, తొంటి రాజేందర్, కాటం సురేశ్, రాచకొండ నరేశ్, చేతి చంద్ర శేఖర్, ఏడబోయిన శ్రీనివాస్ రెడ్డి, సత్తినేని శ్రీనివాస్, కర్ర సూర్య శేఖర్, రవి వర్మ, పటేల్ సుధీర్ రెడ్డి, మాజీ హజ్ కమిటీ మెంబర్ ఇర్ఫాన్ హుల్ హాక్, నరాదాసు వసంత రావు, నరేశ్, మిడిదొడ్డి నవీన్ పాల్గొన్నారు.

