భ‌ర్త‌తో విబేధాలు.. ప్రియుడితో క‌లిసి సూసైడ్‌!

క‌లం, వెబ్‌డెస్క్‌: క‌ర్ణాట‌క‌ (Karnataka)లోని మాండ్య‌లో దారుణం చోటు చేసుకుంది. ఓ వివాహిత త‌న భ‌ర్త‌తో గొడ‌వ ప‌డి ప్రియుడితో క‌లిసి ఆత్మ‌హ‌త్య చేసుకుంది. వీహెచ్ ఫార్మ్ రైల్వే గేట్ స‌మీపంలో ఈ ఘ‌ట‌న జ‌రిగింది. మదనాయకనహళ్లికి చెందిన‌ స‌హాన బెంగ‌ళూరులో ఓ ప్రైవేట్ కంపెనీలో ప‌ని చేస్తుండేది. ఆ స‌మ‌యంలో ఆమె ఆటో డ్రైవ‌ర్ వీరేశ్‌తో ప్రేమ‌లో ప‌డింది. ఎనిమిదేళ్ల క్రితం వీరిద్ద‌రూ పెళ్లి చేసుకున్నారు. వీరిద్ద‌రికి ఓ కుమార్తె, కుమారుడు కూడా ఉన్నారు. ప్ర‌స్తుతం ఈ దంప‌తులు మదనాయకనహళ్లిలో ఓ అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉంటున్నారు. సుహానకు త‌మ అపార్ట్‌మెంట్‌లో ఉండే ర్యాపిడో డ్రైవ‌ర్ రాహుల్‌తో ప‌రిచ‌యం ఏర్ప‌డింది.

కొద్ది రోజుల‌కే ఈ ప‌రిచ‌యం కాస్తా అక్ర‌మ సంబంధానికి దారి తీసింది. ఈ విష‌యం వీరేశ్‌కు తెలియ‌డంతో ఆమెను హెచ్చ‌రించి, రాహుల్‌కు దూరంగా ఉండాల‌ని చెప్పాడు. అయినా స‌హాన‌లో ఏమాత్రం మార్పు రాలేదు. ఆ త‌ర్వాత ఈ వ్య‌వ‌హారంపై పెద్ద మ‌నుషుల మ‌ధ్య పంచాయితీ కూడా పెట్టుకున్నారు. స‌హాన‌కు కుటుంబ‌స‌భ్యులు న‌చ్చ‌జెప్పే ప్ర‌య‌త్నం చేశారు. అయినా స‌హాన ర‌హ‌స్యంగా ప్రియుడిని క‌లుస్తూనే ఉంది. దీంతో ఇటీవల భార్యాభర్తల మధ్య మరోసారి పెద్ద ఎత్తున‌ గొడవ జ‌రిగింది. భ‌ర్త‌తో గొడ‌వ‌ప‌డి స‌హాన పుట్టింటికి వెళ్లిపోయింది. రాహుల్ గురువారం అక్క‌డికి వెళ్లి స‌హాన‌ను క‌లిశాడు. త‌మ జీవితాల్లో జ‌రుగుతున్న ప‌రిణామాల‌పై ఇద్ద‌రూ మాట్లాడుకున్నారు. అనంత‌రం ఇద్ద‌రూ ఆత్మ‌హ‌త్య చేసుకోవాల‌ని నిర్ణ‌యించుకున్నారు. మాండ్య‌లోని వీహెచ్ ఫార్మ్ రైల్వే గేట్ స‌మీపంలో రైలు కింద‌పడి సూసైడ్ చేసుకున్నారు. ఈ ఘటనపై రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>