కుటుంబ దత్తత కార్యక్రమానికి అపూర్వ స్పందన

కలం, జడ్చర్ల: జడ్చర్ల మండల పరిధిలోని గంగాపూర్ (Gangapur) గ్రామంలో శనివారం నిర్వహించిన కుటుంబ దత్తత కార్యక్రమానికి అపూర్వ స్పందన లభించింది. ప్రభుత్వ వైద్య కళాశాల, మహబూబ్‌నగర్‌లోని కమ్యూనిటీ మెడిసిన్ విభాగం ఆధ్వర్యంలో 2026 ఎంబీబీఎస్ బ్యాచ్ విద్యార్థుల కోసం గంగాపూర్‌లో కుటుంబ దత్తత కార్యక్రమం నిర్వహించారు.

కార్యక్రమానికి కమ్యూనిటీ మెడిసిన్ విభాగాధిపతి డాక్టర్ కె. కోటేశ్వరమ్మ నాయకత్వం వహించగా, విభాగంలోని అధ్యాపకులందరూ, పీజీ వైద్య విద్యార్ధులు, ఇతర హెల్త్ కేర్ సిబ్బంది, సమన్వయంతో విజయవంతంగా నిర్వహించారు. 2026 బ్యాచ్‌కు చెందిన ఎంబీబీఎస్ విద్యార్థులు కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు.

జాతీయ వైద్య కమిషన్ వైద్య విద్యా పాఠ్య ప్రణాళికలో భాగంగా నిర్వహించే ఈ కుటుంబ దత్తత కార్యక్రమం ద్వారా వైద్య విద్యార్థులు గ్రామీణ ప్రజల ఆరోగ్య అవసరాలను ప్రత్యక్షంగా తెలుసుకోవడం, కుటుంబాల ఆరోగ్య పరిస్థితులను అంచనా వేయడం, ఆరోగ్య సమస్యలను గుర్తించడం, ఆరోగ్య అవగాహన కల్పించడం, ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ సేవలపై అవగాహన పెంపొందించుకోవడం ప్రధాన ఉద్దేశ్యం.ఈ సందర్భంగా గ్రామ ప్రజల సహకారం, స్థానిక ఆరోగ్య సిబ్బంది సమన్వయం కార్యక్రమానికి ఎంతో తోడ్పడ్డాయి.

కార్యక్రమం సజావుగా నిర్వహించడానికి సహకరించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి, వైద్య సిబ్బంది, గంగాపూర్ గ్రామ సర్పంచ్, వార్డు సభ్యులు, ఇతర గ్రామస్థాయి ప్రజాప్రతినిధులకు ప్రభుత్వ వైద్య కళాశాల, మహబూబ్‌నగర్ కమ్యూనిటీ మెడిసిన్ విభాగం తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>