కలం, వెబ్ డెస్క్ : తిరుమల (Tirumala) ఒక సైకో హల్ చల్ చేశాడు. అక్కడకు వచ్చిన భక్తులతో అసభ్యకరంగా ప్రవర్తిస్తూ భయటపెట్టాడు. చిన్న పిల్లల వెంట పడుతూ చంపేస్తానంటూ కత్తితో బెదిరించాడు. అక్కడున్న వారు పోలీసులకు సమాచారం అందించగా.. వారు వచ్చి సైకోను నివారించారు. అతన్ని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. నిందితుడు పశ్చిమ బెంగాల్ కు చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. కొంత కాలంగా తిరుమల రోడ్లపై తిరుగుతూ ఇలాగే వచ్చిపోయే వారిని ఇబ్బందిపెడుతున్నట్టు పోలీసులు తెలిపారు.
Read Also: మద్యం మత్తులోనే భార్య హత్య.. నల్లకుంట ఘటనపై డీసీపీ ప్రెస్ మీట్
Follow Us On: X(Twitter)


