బీఆర్ నాయుడుని తొలగించాలి.. నగరిలో రోజా, భూమన నిరసన

కలం, వెబ్ డెస్క్: ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని నగరి నియోజకవర్గం పరిధిలో వైయస్ఆర్సీపీ ఆధ్వర్యంలో శనివారం టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు (BR Naidu) వ్యవహార శైలికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. వడమాలపేట అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ ఆదేశాల మేరకు పార్టీ శ్రేణులతో మాజీ మంత్రి ఆర్కే రోజా ( RK Roja), ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు భూమన కరుణాకర్ రెడ్డి (Bhumana Karunakar Reddy) (టీటీడీ మాజీ చైర్మన్) నిరసన తెలిపారు. బీఆర్ నాయుడు వ్యవహార శైలిని ఖండిస్తూ, ఆయనను వెంటనే పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. డౌన్ డౌన్ బీఆర్ నాయుడు నినాదాలతో నిరసన ర్యాలీ నిర్వహించారు.

టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు అనైతిక కార్యకలాపాలకు పాల్పడుతున్నాడని, ఆయన ఉపయోగిస్తున్న భాష తిరుమల పవిత్రతను దెబ్బతీస్తోందని రోజా ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయంపై ప్రభుత్వం స్పందించకపోవడం పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రీనివాసుడి భక్తుల మనోభావాలు దెబ్బతింటున్నాయని అన్నారు. అందువల్ల బీఆర్ నాయుడిని వెంటనే టీటీడీ చైర్మన్ పదవి నుంచి తొలగించి, తిరుమల పవిత్రతను కాపాడాలని డిమాండ్ చేశారు. నియోజకవర్గ పరిధిలోని నగిరి, నిండ్ర, విజయపురం, వడమలపేట, పుత్తూరు మండలాలు, అలాగే నగరి మరియు పుత్తూరు మున్సిపాలిటీలలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయాలలో వైయస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. నగరి నియోజకవర్గానికి చెందిన వైయస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>