బండి భగీరథ్ కేసులో ట్విస్ట్‌.. అనుచిత పోస్టులపై కేసు నమోదు!

కలం, వెబ్‌ డెస్క్‌ : కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి సాయి భగీరథ్ (Bhagirath Case) ముందస్తు బెయిల్ విచారణ నేపథ్యంలో సామాజిక మాధ్యమాల్లో హైకోర్టు న్యాయమూర్తిని లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న దుష్ప్రచారం కలకలం రేపుతోంది. ఒక మహిళా న్యాయమూర్తిపై సోషల్ మీడియాలో అనుచిత ఆరోపణలు చేస్తూ కొందరు కల్పిత కథనాలతో కూడిన పోస్టులు పెట్టారు. ఒక పోక్సో (POCSO) కేసులో భగీరథ్‌కు ముందస్తు బెయిల్ మంజూరు చేస్తే సదరు వెకేషన్ జడ్జి జస్టిస్ తంగిరాల మాధవీదేవి భర్తకు బార్ కౌన్సిల్ ఆఫ్ తెలంగాణ చైర్మన్ పోస్ట్ ఇస్తారంటూ ఈ పోస్టుల్లో పేర్కొన్నారు.

ఇలాంటి ఆధార రహిత, కల్పిత ఆరోపణల వల్ల న్యాయవ్యవస్థ ప్రతిష్టకు భంగం కలగడమే కాకుండా ప్రజల్లో ఉన్న నమ్మకం దెబ్బతినే ప్రమాదం ఉందని హైకోర్టు రిజిస్ట్రార్ (జుడిషియల్-II) బి.ఎస్. చిరంజీవి తీవ్రంగా పరిగణించారు. ఈ దుష్ప్రచారంపై ఆయన చార్మినార్ పోలీసులకు రాతపూర్వక ఫిర్యాదు చేశారు. హైకోర్టు రిజిస్ట్రార్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా చార్మినార్ పోలీసులు భారతీయ న్యాయ సంహిత (BNS), ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) యాక్ట్ లోని పలు సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ వివాదాస్పద పోస్టుల వెనుక ఉన్న నిందితులను గుర్తించేందుకు పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు.

Read Also: బండి భగీరథ్ ఇష్యూ.. తెలంగాణలో బీజేపీ డ్యామేజ్ కంట్రోల్

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>