కలం, వెబ్ డెస్క్: ఏపీలోని రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ (Arava Sridhar) బాధితురాలు హర్షవీణ (Harshaveena Case)పై ఇటీవల దాడి జరిగిన విషయం తెలిసిందే. జనసేన పార్టీకి సంబంధించిన నేత నాగేంద్ర హర్షవీణను నడిరోడ్డు మీదే చితక బాదాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు హర్షవీణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టారు. ఈ కేసులో తాతంశెట్టి నాగేంద్ర, నవీన్‌లను ఐదు గంటల పాటు విచారించారు. రేణిగుంట డీఎస్పీ ఎదుట విచారణ సాగింది. సంఘటనకు దారితీసిన పరిణామాలపై పోలీసులు సవివరంగా ప్రశ్నించినట్లు సమాచారం.
విచారణ అనంతరం తాతంశెట్టి నాగేంద్ర మాట్లాడుతూ, దాడి ఘటనకు సంబంధించిన అన్ని వివరాలను పోలీసులకు వెల్లడించామని తెలిపారు. విచారణకు పూర్తిగా సహకరించామని, తమవంతు సమాచారం మొత్తం ఇచ్చామని చెప్పారు.
ఈ ఘటనకు (Harshaveena Case) సంబంధించి అనేక ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. ఓ మహిళను నడిరోడ్డు మీద చితకబాదినా పోలీసులు చర్యలు తీసుకోవడంలో ఆలసత్వం వహిస్తున్నారని.. తూతుమంత్రంగా విచారణ ముగిస్తున్నారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఎమ్మెల్యే మీద ఆరోపణలు చేసిన బాధిత మహిళకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత పోలీసుల మీద లేదా? అంటూ వారు ప్రశ్నిస్తున్నారు. పోలీసుల చేతిలోని లాఠీని లాక్కొని నడిరోడ్డు మీద కొట్టడం వికృత చర్య అని అభివర్ణిస్తున్నారు. ఈ ఘటనపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించాలని డిమాండ్ చేస్తున్నారు.
Read Also: తిరుపతి జిల్లా శేషాపురం పరిసరాల్లో ఏనుగుల హల్ చల్
Follow Us On : WhatsApp

