Mobile Popup Ad
Mobile Popup Ad

మెరిసే చర్మం కావాలా? ఈ ఫేస్ ప్యాక్ ట్రై చేయండి

కలం, వెబ్ డెస్క్: చర్మ సౌందర్యం కోసం యువత ఖరీదైన క్రీములు వాడుతుంటారు. పార్లర్‌కు వెళ్లి ఫేషియల్స్ చేయించుకుంటారు. కానీ వీటి అవసరం లేకుండా ఇంట్లో దొరికే పాల మీగడతో (Milk Cream Face Pack) మెరిసే చర్మాన్ని సొంతం చేసుకోవచ్చని చెబుతున్నారు సౌందర్య నిపుణులు. పాల మీగడలో లాక్టిక్ యాసిడ్ ఉంటుంది. ఇది డెడ్ స్కిన్ సెల్స్ ను తొలగించడానికి ఉపయోగపడుతుంది. అంతే కాకుండా మీగడలో ఉండే సహజ కొవ్వు చర్మానికి తేమను అందించి హైడ్రేటెడ్‌గా ఉంచడంలో సహాయపడుతుంది.

ఫేషియల్ కోసం పార్లర్ కు వెళ్లకుండా కేవలం ఇంట్లో సులభంగా దొరికే పాలమీగడ, బంగాళదుంప రసంతో తయారు చేసుకునే ఫేస్ ప్యాక్ (Milk Cream Face Pack) చర్మానికి మృదుత్వాన్ని అందించి తేమను కాపాడుతుందని చెబుతున్నారు సౌందర్య నిపుణులు. బంగాళదుంప రసంలో విటమిన్–సి, యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి చర్మాన్ని తాజాగా ఉంచడంలో సహాయపడతాయి. ఈ ఫేస్ ప్యాక్ ను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

తయారీ విధానం

1 లేదా 2 స్పూన్ల తాజా పాల మీగడను తీసుకోవాలి. దీంట్లో కొద్దిగా తాజా బంగాళదుంప రసం వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖం, మెడపై సమానంగా అప్లై చేయాలి. 15 నుంచి 20 నిమిషాలు ఆరిన తర్వాత మంచి నీటితో శుభ్రం చేసుకోవాలి. తర్వాత మాయిశ్చరైజర్ రాసుకోవాలి. అయితే బంగాళదుంప పడని వారు బియ్యం కడిగిన నీటిని ప్రత్యామ్నాయంగా ఉపయోగించవచ్చని సూచిస్తున్నారు నిపుణులు. ఈ ఫేస్ ప్యాక్ ను వారానికి రెండు సార్లు ఉపయోగించడం వలన మంచి ఫలితం ఉంటుందని చెబుతున్నారు.

Note: ప్రతి ఒక్కరి చర్మ తత్వం ఒకేలా ఉండదు. కాబట్టి ఈ చిట్కాను ఉపయోగించే ముందు తప్పనిసరిగా ప్యాచ్ టెస్ట్ చేయడం అవసరం. దురద, మంట, ఎరుపు లేదా అలర్జీ లక్ష్మణాలు కనిపిస్తే వాడొద్దు.

Read Also: వర్షాకాలంలో పుదీనా తింటున్నారా? అయితే జాగ్రత్త!

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>