‘వారణాసి’ మూవీపై ప్రియాంక చోప్రా ఆసక్తికర వ్యాఖ్యలు

కలం, సినిమా : టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శక దిగ్గజం రాజమౌళి కాంబినేషన్ లో వస్తున్న బిగ్గెస్ట్ పాన్ వరల్డ్ మూవీ “వారణాసి”(Varanasi). దాదాపు 1000 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ బిగ్గెస్ట్ మూవీ ఏప్రిల్7, 2027న ప్రపంచవ్యాప్తంగా ఎంతో గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. ఇదిలా ఉంటే ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్న గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా (Priyanka Chopra) వారణాసి మూవీపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.

వారణాసి (Varanasi) సినిమా చూసినంత సేపు మనం సరికొత్త కాలంలో ప్రయాణిస్తాం. ఈ  బిగ్గెస్ట్ అడ్వెంచరస్ మూవీ కోసం గత 14 నెలలుగా ఎంతో హార్డ్ వర్క్ చేస్తున్నామని.. ప్రియాంక (Priyanka Chopra) తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులకు వారణాసి మంచి అనుభూతినిస్తుంది. ఇండియన్ సినిమాకి సరికొత్త నిర్వచనం ఇస్తుంది అంటూ  ప్రియాంక ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ప్రియాంక చోప్రా కామెంట్స్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి.

Read Also:  విజ‌య్‌, ర‌ష్మిక‌కు ప్ర‌ధాని మోడీ విషెస్‌!

Follow Us On: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>