కలం, వెబ్ డెస్క్: టీ20 వరల్డ్‌కప్‌లో (T20 World Cup) భాగంగా ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్ ఓడిపోయింది. ఈ ఓటమిపై పాక్ పేసర్ షాహిన్ అఫ్రిదీ (Shaheen Afridi) స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తమ జట్టులో సరైన భాగస్వామ్యాలు లేకపోవడమే ఓటమికి ప్రధాన కారణమని పేర్కొన్నారు. సింగిల్స్, డబుల్స్ తీస్తూ స్ట్రైక్ రొటేట్ చేయడంలో తమ బ్యాటర్లు విఫలమయ్యారని అఫ్రిదీ అభిప్రాయపడ్డారు. ఛేజింగ్‌లో ఇంగ్లండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ అద్భుత సెంచరీతో చెలరేగారు. షాహీన్ అఫ్రిది 4 వికెట్లు తీసి ఇంగ్లండ్‌ను దెబ్బతీసినప్పటికీ.. చివరి ఓవర్లో ఇంగ్లండ్ లక్ష్యాన్ని చేరుకుంది. ఈ విజయంతో ఇంగ్లండ్ సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది.
పల్లెకెలె అంతర్జాతీయ స్టేడియంలో టాస్ గెలిచిన ఇంగ్లండ్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్‌కు దిగిన పాక్.. నిర్ణీత ఓవర్లలో పాక్ 9 వికెట్ల నష్టానికి 164 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఇంగ్లండ్ బౌలర్లు క్రమశిక్షణతో బౌలింగ్ చేయడంతో పాక్ బ్యాటర్లు తడబడ్డారు. ముఖ్యంగా లెగ్ స్పిన్నర్ ఆదిల్ రషీద్ మిడిల్ ఓవర్లలో పాక్ పరుగుల వేగాన్ని కట్టడి చేశారు.
మ్యాచ్ అనంతరం షాహీన్ అఫ్రిది (Shaheen Afridi) మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. తమ జట్టులో సరైన భాగస్వామ్యాలు లేకపోవడమే ఓటమికి ప్రధాన కారణమని ఆయన పేర్కొన్నారు. పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉన్నప్పటికీ.. మిడిల్ ఓవర్లలో వికెట్లు వరుసగా కోల్పోవడం వల్ల స్కోరు 180-190 వరకు వెళ్లలేకపోయిందని చెప్పారు.హ్యారీ బ్రూక్ క్రీజులో ఉండి భాగస్వామ్యాలు నెలకొల్పిన తీరును ఆయన మెచ్చుకున్నారు. టీ20ల్లో ప్రతి ఓవర్‌కు సగటున 8 నుంచి 9 పరుగులు రాబట్టాల్సిన అవసరం ఉందని ఆయన గుర్తు చేశారు.
Read Also: ‘వారణాసి’ మూవీపై ప్రియాంక చోప్రా ఆసక్తికర వ్యాఖ్యలు
Follow Us On : WhatsApp

