విజ‌య్‌, ర‌ష్మిక‌కు ప్ర‌ధాని మోడీ విషెస్‌!

క‌లం, వెబ్ డెస్క్‌: ప్రధాని నరేంద్ర మోడీ (PM Modi) ప్రముఖ హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), హీరోయిన్ రష్మిక మందన్నా (Rashmika Mandanna)ల పెళ్లి సంద‌ర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేర‌కు ఆయ‌న దేవ‌ర‌కొండ కుటుంబానికి లేఖ రాశారు. విజ‌య్ తండ్రి గోవ‌ర్ధ‌న్ రావు, త‌ల్లి మాధ‌వి పెళ్లికి ఆహ్వానించినందుకు మోడీ ధ‌న్య‌వాదాలు తెలిపారు. దేవరకొండ, మంద‌న్నా కుటుంబాలకు ఈ వేడుక ఎంతో సంతోష‌క‌ర‌మైన‌ద‌ని చెప్పారు. విజయ్, రష్మిక జీవితంలో కొత్త అధ్యాయం మొదలైంద‌ని, ఇద్ద‌రూ జీవితాంతం మంచి స్నేహితులుగా ఉండాలని కోరారు.

ప్రేమ, పరస్పర గౌరవంతో ఒకరికొకరు తోడుగా ఉండాల‌ని సూచించారు. సినిమాల్లో ఈ జోడి చేసిన మ్యాజిక్ కంటే వారి నిజ జీవితంలోని ప్రేమ‌ కథ మరింత అందంగా ఉంటుంద‌న్నారు. భవిష్యత్తులో వారి కలల‌న్నీ నిజం చేసుకుంటూ, బాధ్యతలు పంచుకుంటూ, ఒకరిని ఒకరు గౌరవిస్తూ జీవించాలని మోడీ (PM Modi) ఆశీర్వ‌దించారు. గురువారం ఉద‌య్‌పూర్‌లో ర‌ష్మిక, విజ‌య్‌ల పెళ్లి జ‌రుగ‌నుంది.

Read Also: కొందరు మతాన్ని వేషాల్లోనే అనుసరిస్తారు: పూనమ్ కౌర్

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>