కలం వెబ్ డెస్క్ : భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము(Droupadi Murmu) ఆదివారం కర్ణాటక(Karnataka)లోని కార్వార్ నావల్ బేస్‌లో భారత నౌకాదళానికి చెందిన స్వదేశీంగా నిర్మించిన కల్వరి క్లాస్ సబ్ మెరైన్(Kalvari Class Submarine)లో ప్రయాణించారు. పశ్చిమ తీర ప్రాంతంలో ఆమె ఒక నౌకాదళ పర్యటనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గోవా, కర్ణాటక, జార్ఖండ్‌లలో పర్యటించనున్నారు. సర్వసైన్యాధిపతిగా ఉన్న రాష్ట్రపతితో భారత నౌకాదళ అధిపతి అడ్మిరల్ దినేశ్ కె. త్రిపాఠి సైతం ఉన్నారు. కల్వరి తరగతి సబ్‌మెరైన్‌లో రాష్ట్రపతి ప్రయాణించడం ఇది తొలిసారి. కాగా, గతంలో మాజీ రాష్ట్రపతి డా.ఏపీజే అబ్దుల్ కలాం 2006లో ఇలా సబ్‌మెరైన్‌లో ప్రయాణించారు. సబ్ మెరైన్‌లో ప్రయాణించిన రెండో భారత రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము రికార్డు క్రియేట్ చేశారు.
Read Also: మా దగ్గర హైడ్రోజన్ బాంబు ఉంది.. అమెరికాకు చైనా వార్నింగ్!
Follow Us On: Youtube


