కలం, వెబ్‌డెస్క్: ‘ మా దగ్గర హైడ్రోజన్ బాంబ్ (Hydrogen Bomb) ఉంది. యుద్ధం కావాలనుకుంటే చెప్పు.. చేస్తాం. కానీ, మమ్మల్ని నాశనం చేయాలనుకుంటే మాత్రం నువ్వు నాశనమైపోతావ్. మేం మొదట తుపాకీ పేల్చం.. కానీ, నువ్వు రెండోసారి పేల్చకుండా చేస్తాం’.. ఇది సినిమా డైలాగ్ కాదు.. అమెరికాకు చైనా (China) అధికారి ఒకరు ఇచ్చిన మాస్ వార్నింగ్. ఆదివారం చైనాలో జరిగిన ఓ కార్యక్రమంలో ‘సెంటర్ ఫర్ చైనా అండ్ గ్లోబలైజేషన్’ వైస్ ప్రెసిడెంట్, చైనా ఎనర్జీ సెక్యూరిటీ ఇన్స్టిట్యూట్ ప్రెసిడెంట్ విక్టర్ జికాయ్ గావో చేసిన వ్యాఖ్యలివి. అంతేకాదు, ఇంకా ఏమన్నాడంటే.. ‘సెప్టెంబర్ 3న బీజింగ్‌లో జరిగిన విక్టరీ పరేడ్ మీరు (అమెరికాను ఉద్దేశించి) చూసినట్లు లేరు. ఆ రోజు మా ఆయుధాలను ప్రదర్శించాం.
వాటిలో డీ–61 అనే మిస్సైల్ స్పెషల్. అందులో 60 న్యూక్లియర్ వార్‌హెడ్స్, ఒక హైడ్రోజన్ బాంబ్ (Hydrogen Bomb) ఉంది. ఈ ఐసీఎంబీ (హైడ్రోజన్ బాంబ్) మా దగ్గర తప్ప మిగిలిన ఏ దేశం దగ్గరా లేదు. ఇది ప్రపంచంలోని ఏ మూలకైనా 20 నిమిషాల్లో చేరుకోగలదు. విధ్వంసం సృష్టించగలదు. దీన్ని ఏదీ అడ్డుకోలేదు. వాషింగ్టన్ ఇది గుర్తుపెట్టుకుంటే చాలు’ అని గావో హెచ్చరించారు. కాగా, చైనా ప్రభుత్వంలోని అత్యంత కీలకమైన వ్యక్తుల్లో ఒకరైన గావో లాయర్, బిజినెస్ మ్యాన్. అంత ఆషామాషీగా ఆయన వ్యాఖ్యలు చేయరు. దీనిపై అమెరికా స్పందించాల్సి ఉంది.
Read Also: అమెరికాలో తెలుగు వ్యక్తి స్టార్టప్‌కు బెదిరింపులు
Follow Us On: Youtube


