కలం, వెబ్డెస్క్: దేశంలో అభివృద్ధి ఫలాలు ప్రతి పౌరుడికి అందాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (Droupadi Murmu) అన్నారు. భారత దేశ స్వాంతంత్య్ర దినోత్సవం సందర్భంగా ద్రౌపది ముర్ము ప్రజలకు కీలక సందేశం అందించారు. ఈ సందర్భంగా యువత తమ కలలను సాకారం చేసుకోవాలని సూచించారు. దేశ ప్రజలు, యువత న్యాయ వ్యవస్థను, చట్ట సభలను గౌరవించాలని కోరారు. వికసిత్ భారత్ లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పని చేయాలన్నారు. వందే మాతరం గీతాన్ని, రాజ్యాంగాన్ని ప్రతి పౌరుడు గౌరవించాలని చెప్పారు. దేశ ప్రజలందరికీ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
Also Read : రాహుల్ గాంధీకి షాక్.. నోటీసులు జారీ!
Follow Us On: X(Twitter)

