రేపటి నుంచి ‘కాకతీయ మ్యూజికల్‌ గార్డెన్‌’ ఓపెన్‌

కలం, హనుమకొండ: వరంగల్ నగరంలోని కాకతీయ మ్యూజికల్‌ గార్డెన్‌ (Kakatiya Musical Garden)ను ఆగస్టు 15వ తేదీ నుంచి ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు హనుమకొండ జిల్లా కలెక్టర్‌, కుడా వైస్‌ ఛైర్‌పర్సన్ చాహత్‌ బాజ్‌పాయ్‌ తెలిపారు. రోజూ ఉదయం 6 నుంచి 9 గంటల వరకు వాకర్లకు, ఉదయం 10 నుంచి రాత్రి 8 గంటల వరకు సాధారణ సందర్శకులకు గార్డెన్‌ అందుబాటులో ఉంటుందన్నారు. నిర్వహణ, సౌకర్యాల పరిరక్షణ కోసం కనీస టికెట్‌ రుసుము వసూలు చేయనున్నారు. ప్రత్యేక ఆకర్షణగా రోజూ సాయంత్రం 7.30 గంటలకు మల్టీమీడియా (మ్యూజికల్‌) షో నిర్వహించనున్నారు. ఆహ్లాదకర వాతావరణంతో పాటు కుటుంబ సభ్యులతో కలిసి సందర్శించేలా గార్డెన్‌ను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు కలెక్టర్‌ తెలిపారు.

Also Read : రేపే స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ.. రేవంత్ సభకు సంగారెడ్డి సర్వం సిద్ధం

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>