కలం, బాసర: బాసర మండలంలో బీజేపీని మరింత బలోపేతం చేసి, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ శ్రేణులు సమాయత్తం కావాలని ముధోల్ ఎమ్మెల్యే (Mudhol MLA) పవార్ రామారావు పటేల్ (Pawar Rama Rao Patel) అన్నారు. మంగళవారం భైంసా పట్టణంలోని తన నివాసంలో బాసర మండల బీజేపీ నాయకులు ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల పార్టీ జిల్లా, మండల స్థాయిలో వివిధ పదవులు పొందిన నాయకులను ఎమ్మెల్యే ఘనంగా సన్మానించారు.
ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రాబోయే ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సహకార సంఘాల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని బాసర మండలంలో పార్టీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేయాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లడంతో పాటు కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బాసర మండల బీజేపీ అధ్యక్షుడు పుట్నాల సాయినాథ్, బాసర లిఫ్ట్ ఇరిగేషన్ చైర్మన్ పోగుల రాజేశ్వర్, తదితరులు పాల్గొన్నారు.

