ఏసీబీ సోదాల్లో ట్విస్ట్: నిమ్స్ బార్బర్ ఇంట్లో నోట్ల కట్టలు!

కలం, వెబ్ డెస్క్ : నిజామ్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (NIMS) సీనియర్ అధికారి డాక్టర్ నోరి లక్ష్మీ భాస్కర్‌ (Lakshmi Bhaskar)పై నమోదైన ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అవినీతి నిరోధక శాఖ (ACB) దర్యాప్తు వేగవంతం చేసింది. ఈ కేసుకు సంబంధించిన తనిఖీల్లో భాగంగా ఐదుగురు నిమ్స్ ఉద్యోగుల ఇళ్లలో ఏసీబీ అధికారులు మరోసారి సోదాలు నిర్వహించారు.

ఈ సోదాల్లో నిమ్స్‌లో బార్బర్‌గా పనిచేస్తున్న ధన్‌రాజ్ నివాసంలో రూ.7 లక్షల నగదు లభించడంతో అధికారులు దానిని స్వాధీనం చేసుకున్నారు. ఈ భారీ నగదు వెనుక ఉన్న మూలాలపై ఏసీబీ అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. దీనితో పాటు లభించిన ఐదు ప్రాంతాల భూముల పత్రాలు, ఇతర ఆర్థిక లావాదేవీలపై నిశితంగా పరిశీలన జరుపుతున్నారు.

గతంలో నిర్వహించిన తనిఖీల్లో డాక్టర్ లక్ష్మీ భాస్కర్‌(Lakshmi Bhaskar)కు సంబంధించి రూ.6.13 కోట్ల విలువైన ఆస్తులను ఏసీబీ గుర్తించిన సంగతి తెలిసిందే. ఇందులో 8 ఫ్లాట్లు, 5 ఓపెన్ ప్లాట్లు, బ్యాంకు డిపాజిట్లు, పెట్టుబడులు, లగ్జరీ వాహనాలు, బంగారం ఉన్నాయి. ప్రస్తుతం నిమ్స్ ఉద్యోగుల ఆర్థిక లావాదేవీల ఆధారంగా మనీ ట్రైల్‌ను వెలికితీసేందుకు అధికారులు విచారణను ముమ్మరం చేశారు.

Also Read : ఏటీఎం ఎత్తుకెళ్లేందుకు దొంగల ప్లాన్.. కానీ ఐదు నిమిషాల్లోనే!

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>