వ‌న‌ప‌ర్తిలో ప్రెస్‌క్ల‌బ్ నిర్మాణ స‌న్నాహ‌క స‌మావేశం

కలం, వనపర్తి: జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి అన్ని జర్నలిస్టుల సంఘాలు ఐక్యంగా పని చేయాలని జర్నలిస్టు యూనియన్ల నాయకులు పిలుపునిచ్చారు. వనపర్తి జిల్లా కేంద్రంలో ప్రెస్ క్లబ్ (Wanaparthy Press Club) నిర్మాణాన్ని త్వరితగతిన చేపట్టి, కేటాయించిన స్థలానికి సంబంధించిన ప్రక్రియను కూడా పూర్తి చేయాలని కోరారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన ప్రెస్ క్లబ్ నిర్మాణ సన్నాహక సమావేశంలో వివిధ జర్నలిస్టు యూనియన్ల నాయకులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రెస్ క్లబ్ నిర్మాణం జర్నలిస్టులందరికీ ఉపయోగపడేలా ఉండాలని, భవన నిర్మాణ పనులను త్వరగా ప్రారంభించాలని సూచించారు. జర్నలిస్టుల హక్కులు, సంక్షేమం కోసం సంఘాల మధ్య ఉన్న విభేదాలను పక్కనపెట్టి ఒకే వేదికపైకి రావాలని అన్నారు. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న జర్నలిస్టు కుటుంబాలను ఆదుకునేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని అభిప్రాయపడ్డారు. ప్రెస్ క్లబ్ కేవలం సమావేశాలకే పరిమితం కాకుండా జర్నలిస్టుల ఐక్యత, సంక్షేమానికి కేంద్రంగా నిలవాలని ఆకాంక్షించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>