కలం, జగిత్యాల : అయాన్ష్ ఫిలిమ్స్ బ్యానర్‌పై ప్రతిష్టాత్మకంగా తెరకెక్కనున్న ‘బసవ’ చిత్రం యూనిట్ (Basava Movie Team) సభ్యులు శుక్రవారం జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయ స్వామిని (Kondagattu Anjaneya Swamy Temple) దర్శించుకుని ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ చిత్రానికి అయాన్ష్ రెడ్డి మాసం నిర్మాతగా వ్యవహరిస్తుండగా, కనకం వెంకట్ రచన, దర్శకత్వం వహిస్తున్నారు. ప్రముఖ నటులు యాదమరాజు, తపస్వి రావు ఈ సినిమాలో ప్రధాన పాత్రల్లో నటించనుండగా, కుర్రి, క్రాంతి రెడ్డి తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
ఈ చిత్రానికి ధనరాజ్ లెక్కల క్రియేటివ్ హెడ్‌గా, నేలకొండ విప్లవ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా, పులి రాకేష్ గౌడ్ ప్రొడక్షన్ కంట్రోలర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. స్క్రిప్ట్ పూజ సందర్భంగా చిత్ర బృందం శుక్రవారం కొండగట్టు అంజనేయ స్వామిని దర్శించుకుని, స్వామివారి ఆశీస్సులు తీసుకున్నారు. పూజారులు చిత్ర బృందానికి గోత్ర నామధులతో అర్చన చేసి అధిర్వధించారు. ‘K-Ram’, ‘KA’, ‘సమ్మతమే’ వంటి విజయవంతమైన చిత్రాలకు సినిమాటోగ్రాఫర్‌గా పనిచేసిన ప్రముఖ కెమెరామెన్ సతీష్ రెడ్డి మాసం ఈ చిత్రంతో నిర్మాతగా మారడం విశేషం. ఈ చిత్రానికి ఆయన డీఓపీగా కూడా వ్యవహరించనున్నారు.
గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కనున్న “బసవ ” చిత్రం ఈ సందర్బంగా సతీష్ రెడ్డి మాసం, జగిత్యాలలో మాట్లాడుతూ..గ్రామీణ నేపథ్యంలో ఆసక్తికరమైన కథాంశంతో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని సిరిసిల్ల సమీపంలోని నాగారం గ్రామంలో చిత్రీకరించనున్నట్లు వెల్లడించారు. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన ఇతర వివరాలను వెల్లడించనున్నట్లు వారు వివరించారు. ఈ పూజా కార్యక్రమంలో జగిత్యాల ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ఎన్నం కిషన్ రెడ్డి, సుంకేటి రామకృష్ణారెడ్డి, బూసి రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.

