ప్రజావాణి ఫిర్యాదుపై కలెక్టర్ స్పందన.. ప్రభుత్వ భూమికి హద్దుల నిర్ధారణ

కలం, జగిత్యాల : ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తుపై (Prajavani Complaint) జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ వెంటనే స్పందించి ప్రభుత్వ భూమికి హద్దులు (Government Land Boundaries) నిర్ణయించేలా చర్యలు తీసుకున్నారు. సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో హస్నాబాద్ సర్పంచ్ దమ్మ రాజమ్మ, జగిత్యాల మున్సిపల్ 15వ వార్డు కౌన్సిలర్ అల్లాల సరిత, రమేష్ రావు స్థానిక ప్రజలతో కలిసి ప్రభుత్వ భూమి పరిరక్షణకు సంబంధించి కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు.

ఈ ఫిర్యాదుపై స్పందించిన కలెక్టర్ (Collector Satya Prasad) సంబంధిత రెవెన్యూ అధికారులకు తగిన ఆదేశాలు జారీ చేశారు. దీంతో శుక్రవారం అధికారులు హస్నాబాద్ గ్రామానికి చేరుకుని స్థానిక ప్రజల సమక్షంలో నిజామాబాద్ పాత రహదారి, జాతీయ రహదారి-16 పక్కన ఉన్న సర్వే నంబర్ 1598లోని ప్రభుత్వ భూమికి హద్దులు నిర్ణయించారు. ప్రభుత్వ భూమి పరిరక్షణకు అధికారులు చేపట్టిన చర్యలపై గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో జగిత్యాల సర్వేయర్ రాజు, జీపిఓలు రాజేందర్, రాజ్ కిషన్, డి. మల్లారెడ్డి, రమేష్ రావు, గంగాధర్, దామోదర్ రావు, నవీన్, భగవంత రావు, ప్రశాంత్, సురేష్, లక్షణ్ రావు, జితేందర్, సాయి, రవి, సుగుణాకర్, ప్రజలు పాల్గొన్నారు. సమస్యపై తక్షణమే స్పందించి పరిష్కారానికి చర్యలు తీసుకున్న కలెక్టర్ సత్యప్రసాద్‌కు, రెవెన్యూ సిబ్బందికి గ్రామ ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>