కలం, వెబ్ డెస్క్: ఎన్టీఆర్ (NTR) హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వస్తున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ షూటింగ్ వేగంగా జరుగుతోంది. వచ్చే ఏడాది జూన్ 11న విడుదల కాబోతున్న ఈ మూవీకి ‘డ్రాగన్’ అనే పేరు పరిశీలిస్తున్నట్లు సమాచారం. అయితే అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ఈ ప్రాజెక్ట్ గురించి అనేక ఆసక్తికర విషయాలు తెలుస్తున్నాయి. ఎన్టీఆర్ మేకోవర్‌పై ప్రశాంత్ నీల్ ప్రధానంగా ఫోకస్ చేశాడు. ఈ నేపథ్యంలోనే.. ముందు అనుకున్న స్క్రిప్ట్‌లో చాలా మార్పులు చేసి, తారక్ క్యారెక్టర్ ను మరింత శక్తివంతంగా మార్చారని సమాచారం.
రెండు భాగాల్లో.. రెండు రకాలుగా..
ఈ మూవీ రెండు పార్టులుగా రాబోతుందనే టాక్ వస్తోంది. దీని కోసం ఎన్టీఆర్ రెండు రకాలుగా.. విభిన్న గెటప్స్ లో కనిపించబోతున్నారట. మొదటి పార్టులో లీన్, షార్ప్ మోడ్‌లో కనిపించబోతున్నారట. రెండో పార్టులో పూర్తిగా బాడీ బిల్డింగ్‌తో కనువిందు చేయబోతున్నాడు. యాక్షన్ సీన్స్ కోసమే ప్రశాంత్ నీల్ ఇలా డిజైన్ చేసినట్లు మూవీ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఈ నెల 7వ తేదీ నుంచి కొత్త షెడ్యూల్ ప్రారంభం కాబోతుంది. ఎన్టీఆర్ సరసన రుక్మిణీ వసంత్ హీరోయిన్‌గా కనిపింంచబోతుంది.

