ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలపై బీజేపీ పోరు.. NH-161పై విద్యార్థులతో కలిసి ధర్నా

కలం, మెదక్ బ్యూరో: ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ సంగారెడ్డి (Sangareddy) జిల్లా చౌటకూర్ మండలం శివ్వంపేట వద్ద జాతీయ రహదారి (NH-161) పై విద్యార్థులతో కలిసి బీజేపీ నాయకులు ధర్నా (BJP Protest) చేపట్టారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా విద్యార్థులు, బీజేపీ నాయకులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.

బకాయి పడ్డ ఫీజు రీయింబర్స్‌మెంట్ (Fee Reimbursement) నిధులను వెంటనే విడుదల చేసి విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం ఆడటం మానాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. జాతీయ రహదారిపై ధర్నా (BJP Protest) చేపట్టడంతో కాసేపు వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడి, రోడ్డుకు ఇరువైపులా భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు. బీజేపీ నాయకులను అరెస్ట్ చేసి స్థానిక పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

Also Read : యువతకు అజిత్ దోవల్ కీలక సూచన

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>