Mobile Popup Ad
Mobile Popup Ad

హజ్ యాత్రకు తేదీ ఖ‌రారు.. క‌మిటీ చైర్మ‌న్ కీల‌క ప్ర‌క‌ట‌న‌

క‌లం, వెబ్‌డెస్క్‌: హ‌జ్ (Hajj) యాత్ర‌కు సంబంధించి తేదీలు ఖ‌రార‌య్యాయ‌ని, యాత్రికుల సౌక‌ర్యార్థం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన‌ట్లు హ‌జ్ క‌మిటీ చైర్మ‌న్ ప్ర‌క‌టించారు. ఈ ఏడాది హైద‌రాబాద్ నుంచి మొత్తం 9,960 మంది యాత్రికులు ప‌విత్ర యాత్ర‌కు వెళ్ల‌నున్నారు. వారిలో మెజారిటీ యాత్రికులు తెలంగాణ నుంచే ఉన్నార‌ని ఆయన వెల్ల‌డించారు. ఈసారి యాత్రికుల భ‌ద్ర‌త కోసం ప్ర‌భుత్వం హైటెక్ ఏర్పాట్లు చేసింది. ప్ర‌తి యాత్రికుడికి స్మార్ట్ వాచ్‌ల‌ను అంద‌జేయ‌డం ద్వారా వారి క‌ద‌లిక‌ల‌తో పాటు ల‌గేజీని కూడా ట్రాక్ చేసేలా నిఘా వ్య‌వ‌స్థను సిద్ధం చేశారు. యాత్రికుల‌కు ఎటువంటి ఇబ్బందులు క‌ల‌గ‌కుండా ప‌క్కా ప్ర‌ణాళిక‌తో ముందుకు సాగుతున్నామ‌ని క‌మిటీ స్ప‌ష్టం చేసింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>