శ్రీరాముడిపై వివాదాస్పద వ్యాఖ్యలు.. ప్రకాశ్ రాజ్ క్లారిటీ !

కలం, వెబ్ డెస్క్ : శ్రీరాముడిపై విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ (Prakash Raj) చేసిన వ్యాఖ్యలు వివాదస్పదంగా మారిన సంగతి తెలిసిందే. దీనిపై తాజాగా ప్రకాశ్ రాజ్ వివరణ ఇచ్చారు. శ్రీరాముడిని అవమానించేలా తాను మాట్లాడినట్లు జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని చెప్పారు. తన ప్రసంగాన్ని కొందరు కావాలనే తప్పుగా చిత్రీకరిస్తున్నారని ఆవేదన చెందారు. తన ఉద్దేశం ఎవరినీ కించపరచడం కాదని, కేవలం రాజకీయాలనే తాను ప్రశ్నిస్తున్నానని చెప్పుకొచ్చారు.

తాను హిందూ ధర్మానికి వ్యతిరేకం కాదని ప్రకాశ్ రాజ్ అన్నారు. అన్ని మతాలను, ధర్మాలను గౌరవిస్తానని స్పష్టం చేశారు. సాహిత్య కార్యక్రమంలో చేసిన ప్రసంగంలోని కొన్ని భాగాలను మాత్రమే తీసుకుని తప్పుగా ప్రచారం చేస్తున్నారని వాపోయారు. తాను మతోన్మాత రాజకీయాలపై ప్రశ్నలు అడిగినట్లు వివరణ ఇచ్చారు. కాగా, కేరళ సాహిత్య ఉత్సవంలో పాల్గొన్న ప్రకాష్ రాజ్ మాట్లాడుతూ.. శ్రీరాముడు ఉత్తర భారతదేశానికి చెందినవారని.. రావణుడు దక్షిణ భారతదేశానికి చెందిన ఒక గిరిజన తెగకు చెందినవారని తెలిపారు. అంతేకాదు..శ్రీరాముడు రావణుడి తోటలోని పండ్లను తిని, వాటికి డబ్బులు చెల్లించలేదని చెప్పారు. ఈ వ్యాఖ్యలు హిందూ మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయని పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రకాశ్ రాజ్ పై పరువు నష్టం దావా వేశారు.  ఈ వివాదంపై పరువు నష్టం నోటీసులు కూడా జారీ అయిన నేపథ్యంలో ప్రకాశ్ రాజ్ తాజాగా వివరణ ఇచ్చారు.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>