Mobile Popup Ad
Mobile Popup Ad

‘మేడిగడ్డ’కు రిపేర్‌.. రంగంలోకి స్టీరింగ్ కమిటీ !

క‌లం, వెబ్ డెస్క్ : కాళేశ్వరం ప్రాజెక్టులో అత్యంత కీలకమైన మేడిగడ్డ బ్యారేజీ (Medigadda Barrage) పునరుద్ధరణ దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది. బ్యారేజీ పటిష్టతను శాస్త్రీయంగా అంచనా వేసేందుకు ఒక పక్కా యాక్షన్ ప్లాన్‌ను సిద్ధం చేసింది. ఈ ప్రక్రియను పర్యవేక్షించేందుకు, అవసరమైన అనుమతులు, ఫైనల్ డ్రాయింగ్స్ ఖరారు చేసేందుకు ఒక ఉన్నత స్థాయి స్టీరింగ్ కమిటీని కూడా ఏర్పాటు చేయడం విశేషం.

బ్యారేజీ పునాదులు, నిర్మాణం ఏ మేరకు దెబ్బతిన్నాయనేది తేల్చడానికి ఐదు ప్రధాన విభాగాల్లో మొత్తం 14 రకాల పరీక్షలు నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా జియో టెక్నికల్, జియో ఫిజికల్ పరీక్షలతో పాటు నిర్మాణ దృఢత్వాన్ని పరీక్షించే నాన్ డిస్ట్రక్టివ్ టెస్టులు, హైడ్రాలిక్, హైడ్రోలాజికల్ స్టడీస్ చేపట్టనున్నారు. బ్యారేజీ ప్రస్తుత ఆరోగ్య స్థితిని అంచనా వేసే స్ట్రక్చరల్ హెల్త్ మానిటరింగ్ పరీక్షలు కూడా ఈ షెడ్యూల్‌లో ఉన్నాయి.

ఈ భారీ కసరత్తును కేవలం రెండు నెలల కాలవ్యవధిలోనే పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటికే సెంట్రల్ వాటర్ పవర్ రీసెర్చ్ స్టేషన్‌కు చెందిన సైంటిస్టుల బృందం క్షేత్రస్థాయిలో పరీక్షలను ప్రారంభించింది. ప్రతిరోజూ జరుగుతున్న పరీక్షల పురోగతిపై ప్రభుత్వం ఎప్పటికప్పుడు నివేదికలను తెప్పించుకుంటూ, పనులను అత్యంత ప్రాధాన్యతతో పర్యవేక్షిస్తోంది. నిపుణుల కమిటీ ఇచ్చే ఈ నివేదికల ఆధారంగానే మేడిగడ్డ బ్యారేజీ (Medigadda Barrage) భవిష్యత్తు కార్యాచరణ, శాశ్వత మరమ్మతులపై తుది నిర్ణయం తీసుకోనున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>