Mobile Popup Ad
Mobile Popup Ad

యాదగిరిగుట్టకు వెళ్తుండగా ప్రమాదం.. తల్లీకొడుకులు మృతి

కలం, వెబ్ డెస్క్: తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దర్శనానికి వెళ్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. ఈ ప్రమాదంలో తల్లీకొడుకులు మృతి చెందారు. ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టడంతో తల్లి నందిని (26), కన్నయ్య (7 నెలలు) స్పాట్‌లోనే చనిపోయారు. తండ్రి ప్రకాష్ రెడ్డికి తీవ్ర గాయాలు అయ్యాయి. మహబూబ్‌నగర్ జిల్లా అడ్డాకల్ మండలం స్నేహ కంపెనీ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. మృతులు పెబ్బేరు మండలం కంచిరావుపల్లి గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>