కలం, వెబ్‌డెస్క్: ఎన్టీఆర్ (NTR) జిల్లా నందిగామ (Nandigama) పట్టణంలో మైనింగ్ మాఫియా ఆగడాలకు అడ్డూ అదుపు లేకుండా పోయింది. అక్రమ తవ్వకాలను అడ్డుకున్న రెవెన్యూ అధికారులపై మైనింగ్ మాఫియా దాడికి దిగింది. ఈ ఘటన చందర్లపాడు మండలం ముప్పాళ్ల గ్రామంలో చోటుచేసుకుంది.
గ్రామంలోని టీడీపీ, వైసీపీ నాయకులు అక్రమంగా గ్రావెల్‌ను రవాణా చేస్తున్నారు. ఈ రవాణాను ముప్పాళ్ళ VRO అడ్డుకోవడంతో కేతవీరునిపాడు గ్రామానికి చెందిన టీడీపీ, వైసీపీ నేతలు అతనిపై దాడికి దిగారు. ఈ ఘటనపై VRO పోలీసులకు ఫిర్యాదు చేయగా.. ఘటనా స్థలానికి చేరుకున్న చందర్లపాడు పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

